: రైలు బోగీలపై ‘కాపు’ ఆందోళనకారుల దాడి


తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో కాపు గర్జన కార్యకర్తలు ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలు ఇంజిన్ ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో నలుగురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడితో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కోల్ కతా-చెన్నై జాతీయ రహదారిపైకి కాపు గర్జన కార్యకర్తలు, ప్రజలు భారీగా చేరుకోవడంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News