: టీమిండియాకు భారీ లక్ష్యం!
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా(14), షాన్ మార్ష్(9), మాక్స్ వెల్(3) వరుసగా ఔటయ్యారు. అయినప్పటికీ, వాట్సన్ తన జోరు కొనసాగించాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డ వాట్సన్ వంద పరుగులు పూర్తి చేశాడు. మొత్తం 71 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. తన కెరీర్ లో తొలి టీ 20 సెంచరీ సాధించాడు. దీంతో పాటు టీ ట్వంటీలో ఆస్ట్రేలియా తరపున రెండో శతకాన్ని సాధించిన ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందాడు.