: ప్రేమ విఫలమై విజ్ఞాన్ వర్శిటీ భవనంపై నుంచి దూకిన ప్రకాశం జిల్లా విద్యార్థిని!
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన హరిణి (19) అనే ద్వితీయ సంవత్సరం బయో టెక్నాలజీ విద్యార్థిని తాను చదువుతున్న విజ్ఞాన్ విశ్వ విద్యాలయ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా వడ్లమూడి లోని కళాశాలలో చదువుతున్న హరిణి గత రాత్రి భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. దీన్ని గమనించిన సహ విద్యార్థులు ఆమెను గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆమె ఓ యువకుడిని ప్రేమించిందని, తన ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందన్న ప్రాధమిక సమాచారం తెలిసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వివరించారు.