: ఎర్రచందనం కేసులో మంత్రి బొజ్జల అనుచరుడి అరెస్ట్!


ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని అబ్బాబట్లపల్లి దగ్గర ఓ లారీలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు అధికారులకు పట్టుబడగా, వాటిని తీసుకువెళుతున్న డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో బొజ్జల అనుచరుడిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. పట్టుబడిన దుంగల విలువ సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని వెల్లడించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. బొజ్జల అనుచరుడి అరెస్టుపై మాత్రం అధికారికంగా స్పందించ లేదు.

  • Loading...

More Telugu News