: బీజేపీ తీర్థం పుచ్చుకున్న తమిళ నటుడు విసు
ప్రముఖ తమిళ నటుడు విసు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్.. విసును పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. పలువురు బీజేపీ నేతలు విసుకు శుభాభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో విసు ప్రచారం తమకు లాభించగలదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆయనకు ఓ కీలక పదవి లభించే అవకాశముంది. విసు బీజేపీలో చేరుతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఉపాధ్యక్ష పదవి లేదా కార్యదర్శి పదవి ఆయనకు ఇవ్వచ్చని, ఎన్నికల అనంతరం 'రాజ్యసభ' ఆఫర్ ఉందని పార్టీ వర్గాల సమాచారం.