: తిరుమలలో 2 గంటల్లోపే దర్శనం!
వెంకన్న కొలువైన తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. శ్రీవారి సర్వదర్శనం నిమిత్తం 7 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వివరించారు. నడకదారి భక్తులకు, ప్రత్యేక ప్రవేశం టికెట్లున్న వారికి రెండు గంటల్లోపే దర్శనం చేయిస్తున్నామని తెలిపారు. శనివారం నాడు మొత్తం 75,554 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. చలి తీవ్రత తగ్గకపోవడం, విద్యార్థులకు క్లాసులు జరుగుతుండటంతో భక్తుల సంఖ్య మందగించినట్టు తెలుస్తోంది.