: కేసీఆర్ హైదరాబాదును సెక్యులర్ రాష్ట్రంగా ఉంచారు: డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ
కేసీఆర్ హైదరాబాదును సెక్యులర్ స్టేట్ గా ఉంచారని తెలంగాణ డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ తెలిపారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు వాసుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంరక్షణకు పని చేస్తుందని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనలో ముస్లింలకు ఎన్నో పథకాలు చేపట్టారని ఆయన చెప్పారు. ముస్లింలు సురక్షితంగా ఉండాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు. ముస్లిం యువకుల విద్యకు, వివాహానికి ప్రత్యేక పథకాలు చేపట్టిన ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ మాత్రమేనని ఆయన తెలిపారు. కేసీఆర్ కేవలం హైదరాబాదు ప్రజల కష్టాలే కాకుండా యావత్ తెలంగాణ కష్టాలు తీర్చేందుకు పనులు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలకు ప్రజలు జేజేలు కొడుతున్నారని ఆయన తెలిపారు.