: పరేడ్ గ్రౌండ్స్ కు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరేడ్ గ్రౌండ్సులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లాయి. టీఆర్ఎస్ మంత్రులు మొదలుకొని చిన్నాపెద్ద లీడర్లంతా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమ సంఘాల కార్యకర్తలు పాటలు, గేయాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ రంగు సంతరించుకున్నాయి.