: మంత్రి సమక్షంలో కాలేజ్ లో బ్లేడులతో దాడులు చేసుకున్న విద్యార్థులు


విద్యార్థులు ఒకరిపై మరొకరు బ్లేడులతో దాడులు చేసుకున్న సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని హిందూకాలేజ్ లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు 'యువకెరటాలు' పేరిట ఓ కార్యక్మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ పాఠశాలల్లోని విద్యార్థులను హిందూ కాలేజ్ కు తరలించారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ స్కూల్ విద్యార్థుల్లో కూర్చునే స్థలం విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర రూపం దాల్చింది. దీంతో విద్యార్థులు పరస్పరం బ్లేడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డవారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News