: ఖరీదైన గిఫ్టుల కోసమో లేక డబ్బు కోసమో నాకు మగాడు అక్కర్లేదు: ప్రియాంకా చోప్రా


మనసులో భావాలను సూటిగా వ్యక్తీకరించడంలో బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రాది ప్రత్యేక శైలి. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా పెళ్లెప్పుడు? మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఎలాంటి వ్యక్తి మీకు భర్తగా కావాలి? అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పింది. ఖరీదైన గిఫ్టుల కోసమో లేక ఆర్థిక అవసరాలు తీర్చేందుకు మగాడు అవసరం లేదని స్పష్టం చేసింది. స్వశక్తితో పైకెదిగిన తాను కష్టపడి సంపాదించుకున్నదానితో వజ్రాలు, వైఢూర్యాలు కొనుక్కోగలనని, అందుకోసం ఎవరినో వెతుక్కోవాల్సిన అవసరం లేదని తెలిపింది. తనకు మగాడి అవసరం పిల్లల్ని కనేందుకేనని తెగేసి చెప్పింది. తనతో జీవితం పంచుకునేందుకు నిజాయతీ కలిగిన వ్యక్తి కావాలని తెలిపింది. నిజాయతీగా ఉండే వ్యక్తితో జీవితం పంచుకుంటానని చెప్పింది. ప్రేమ పేరుతో మోసం చేస్తే, చెంపలు వాయిస్తానని ప్రియాంకా చోప్రా వెల్లడించింది. సెలబ్రిటీ అయినంతమాత్రాన వ్యక్తిగత జీవితం గురించి బయటకి చెప్పాల్సిన అవసరం లేదని ప్రియాంక ముక్తాయించింది.

  • Loading...

More Telugu News