: కేజ్రీవాల్ సర్కారుకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు... 3 నెలల్లో ‘బై పోల్స్’ ముగించాలని ఆదేశం


ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలోని ఢిల్లీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీ పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లకు కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు హైకోర్టు ముకుతాడు వేసింది. ముందుగా సదరు కార్పొరేషన్లలో ఖాళీ అయిన 13 డివిజన్లకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఉప ఎన్నికలను మూడు నెలల్లోగా ముగించాలని కూడా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ హైకోర్టు ఆప్ సర్కారుకు షాకిచ్చే తీర్పు చెప్పింది. 2017లో ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కాస్తంత ముందుగానే ఆయా కార్పొరేషన్ల పాలకవర్గాలను డిజాల్వ్ చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా ఆ పాలకవర్గాలను చేజిక్కించుకోవాలని ఆప్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఆ పార్టీ ప్రభుత్వానికి షాకేనని చెప్పాలి.

  • Loading...

More Telugu News