: సెంట్రల్ వర్సిటీలో రాహుల్ గాంధీ... 18 గంటల సామూహిక నిరాహార దీక్షకు శ్రీకారం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అడుగుపెట్టారు. వర్సిటీ అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల బర్త్ డేను పురస్కరించుకుని నిన్న రాత్రి నుంచి అతడి కుటుంబం, విద్యార్థులు చేపట్టిన 18 గంటల మాస్ హంగర్ స్ట్రయిక్ (సామూహిక నిరాహారదీక్ష)లో ఆయన పాలుపంచుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరుకున్న వెంటనే నేరుగా వర్సిటీకి చేరుకున్న ఆయన వర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాలుపంచుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన హంగర్ స్ట్రయిక్ లో కూర్చున్నారు. నేటి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనున్న ఈ దీక్షలో రాహుల్ చివరి దాకా పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళతారు.