: మలుపు తిరిగిన బీహార్ యువతి కిడ్నాప్ కేసు...తనను ఎమ్మెల్యే కిడ్నాప్ చేయలేదని ప్రకటన!


బాలీవుడ్ సినిమా 'గంగాజల్'ను తలపించే విధంగా బీహార్ లో ఎమ్మెల్యే సిద్ధార్థ్ సింగ్ ఓ యువతి (20)ని కిడ్నాప్ చేశాడని ఆమె తండ్రి పెట్టిన కేసు కొత్త మలుపు తిరిగింది. నేటి సాయంత్రం పాట్నా ఎస్పీ మను మహారాజ్ ఎదుట ఎమ్మెల్యే కారు డ్రైవర్ తో ప్రత్యక్షమైన సదరు యువతి తనను ఎమ్మెల్యే కిడ్నాప్ చేయలేదని తెలిపింది. సిద్ధార్థ్ సింగ్ కారు డ్రైవర్ పంకజ్ శర్మతో రెండేళ్లుగా తనకు అనుబంధం కొనసాగుతోందని చెప్పింది. ఆయన తన బాయ్ ఫ్రెండ్ అని ఎస్పీకి తెలిపింది. పంకజ్ సింగ్ తో ఇష్టపూర్వకంగానే వెళ్లానని ఆమె వెల్లడించింది. తన అభీష్టానికి వ్యతిరేకంగా తన తండ్రి 50 ఏళ్ల వ్యక్తితో వివాహం నిర్ణయించారని, అందుకే తాను పంకజ్ తో వెళ్లిపోయానని ఆమె చెప్పింది. గత రాత్రి తామిద్దరం వివాహం చేసుకున్నామని ఆమె తెలిపింది. తన పరారీలో ఎమ్మెల్యే పాత్రలేదని ఆమె స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News