: కేటీఆర్ గారూ.. మంచినీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు?: సినీ నటుడు ప్రకాశ్ రాజ్


‘కేటీఆర్ గారూ.. హైదరాబాద్ లో మంచినీటి సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు?’ అని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తో ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ... ‘మంచినీటి సమస్యని పరిష్కరించే విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాం. తెలంగాణకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ‘మిషన్ భగీరథ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందుకు సంబంధించిన మొదటి ఫలితాలు ఈ ఏప్రిల్ చివరినాటికి వస్తాయి. దాదాపు తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తాము. హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఆలోచనతో పోతున్నాము. రెండు మంచినీటి రిజర్వాయర్లను హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి హైదరాబాద్ లో ప్రతి వ్యక్తికి అవసరమైన నీటిని అందించాలని సంకల్పంగా పెట్టుకున్నాము’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News