: హైదరాబాద్ సిటీని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు?: కేటీఆర్ తో నాగార్జున
‘ఐఫా’ను విజయవంతం చేసినందుకు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానని మంత్రి కేటీఆర్ తో సినీనటుడు నాగార్జున అన్నారు. కేటీఆర్ తో ఒక ఛానెల్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడారు. ‘ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన మీరు.. హైదరాబాద్ సిటీని ఎలా చూడాలనుకుంటున్నారు?’ అని నాగార్జున ప్రశ్నించగా....‘ఒక నగరం నివాసయోగ్యంగా ఉండాలి. కనీస అవసరాలు ఉండాలి. ఫుట్ పాత్ లు, పచ్చదనం, నైట్ షెల్టర్స్, గ్రంథాలయాలు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా.. అన్ని సౌకర్యాలు ఉండాలి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా ఎదగడానికి కనీస మౌలిక వసతులు లోపించాయి. మంచినీటి రిజర్వాయర్లు లేవు. సామాన్యుడికి ప్రభుత్వంతో ప్రమేయం ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. ఉదాహరణకు.. నేను ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. ఒకే ఒక్కసారి అక్కడ గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లాను. అది కూడా ... నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లాను. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో వస్తే నిజమైన విజయం సాధించినట్లే’ అని కేటీఆర్ సమాధానమిచ్చారు.