: దీటుగా బదులిస్తున్న ఆసీస్ ఓపెనర్లు


ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ టీమిండియాకు దీటుగా బదులిస్తోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న రెండో టీట్వంటీ మ్యాచ్ లో 185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఓపెనర్లు ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఓవర్ కు 9 పరుగులు సాధించాల్సిన దశలో బ్యాటింగ్ దిగిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ (42), షాన్ మార్ష్ (16) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా చెరి మూడు ఓవర్లు బౌలింగ్ చేయగా, వారిద్దరినీ ఫించ్, మార్ష్ ఆటాడుకున్నారు. ఫోర్లతో విరుచుకుపడ్డ వీరిద్దరి ధాటికి ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News