: ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కు: కిషన్ రెడ్డి


ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఎంఐఎం కనుసన్నల్లో టీఆర్ఎస్ నడుస్తోందని, గతంలో ఎంఐఎం చేసిన దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ‘ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయదా?’ అని ప్రశ్నించారు. ‘గ్రేటర్’లో బీజేపీ, టీడీపీలే అతిపెద్ద పార్టీలని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News