: ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి


ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం భీమారం వద్ద ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. చెన్నూరు నుంచి ఓ ఆటో మంచిర్యాల వెళుతుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News