: టాస్ ఆసీస్ దే!... ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే!
రెండో టీ20లో టాస్ ముగిసింది. ఫస్ట్ మ్యాచ్ లో మాదిరిగానే... నేటి మ్యాచ్ లోనూ టాస్ ఆతిథ్య జట్టు ఆసీస్ నే వరించింది. తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి పర్యాటక జట్టు టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్ అప్పగించిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ నేటి వన్డేలోనే అదే వ్యూహాన్ని అమలు చేశాడు. టాస్ గెలిచిన ఫించ్ బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మరికాసేపట్లో టీమిండియా తన ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఆసీస్ జట్టులో మ్యాక్స్ వెల్ బరిలోకి దిగడం మినహా ఇరు జట్ల కూర్పులో మార్పేమీ లేదు.