: రజనీకాంత్ కు పద్మ విభూషణ్ ఇవ్వడంలో ఎలాంటి రాజకీయం లేదు: జవదేకర్
ప్రముఖ నటుడు రజనీకాంత్ కు ఇటీవల పద్మవిభూషణ్ ప్రకటించడంపై తమిళ మీడియాలో వస్తున్న కథనాలను, ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. ఈ పురస్కారం ఇవ్వడంలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. కోయంబత్తూర్ లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నిన్న(గురువారం) అక్కడికి వచ్చిన జవదేకర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి విమానాశ్రయంలో మీడియా వారు రజనీకి పద్మ పురస్కారంపై ప్రస్తావించారు. దీనికి స్పందించిన మంత్రి, ఆయనకు అవార్డు ఇవ్వడం ద్వారా ఆ పురస్కారానికి గౌరవాన్ని కలిగించామని చెప్పారు. ఈ విషయాన్ని రజకీయం చేయవద్దని సూచించారు. రజనీకాంత్ మంచి మనిషని, గొప్ప నటుడని కితాబిచ్చారు. ఏ తరంవాళ్లకైనా ఆయనంటే ఎంతో ఇష్టమన్న జవదేకర్, ఆయన స్టైల్ రాబోయే తరాల వారికి కూడా నచ్చుతుందని చెప్పారు.