: విమానంలో ప్రయాణికులు, సిబ్బంది వరుసగా స్పృహ కోల్పోయారు...విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్


సాధారణంగా విమానంలో ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తారు. అలాంటిది విమానంలో సిబ్బంది, ప్రయాణికులు ఒకరితరువాత ఒకరు స్పృహ తప్పి పడిపోతుంటే ఆ విమానంలో ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుంది. అలాంటి ఘటనే లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిలెస్ కి బయల్దేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. ఈ విమానం బయల్దేరిన కాసేపటికి విమానంలోని ఆరుగురు సిబ్బంది, ఒక ప్రయాణికుడు ఒకరి తరువాత ఒకరుగా స్పృహ తప్పి పడిపోయారు. మరో ఇద్దరు ప్రయాణికులు స్పృహ తప్పి పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ఇతర సిబ్బంది పైలట్ కు సమాచారం అందించారు. దీంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించి, విమానాన్ని వెనక్కి తిప్పి హీత్రూ విమానాశ్రయంలో దించేశారు. విమానం ల్యాండ్ కాగానే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లు అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయాధికారులు విమానంలో ఉన్న వస్తువులన్నింటినీ సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. విమానంలో గాలి కలుషితమైనందునే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News