: విద్యార్థులకు రాజ్ కుమార్ హిరానీ బంపర్ ఆఫర్


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తాను నిర్మాతగా వ్యవహరించిన తాజా సినిమా 'సాలా ఖడూస్' రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను విద్యార్థులు ఫ్రీగా వీక్షించవచ్చని ఆయన తెలిపాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, 'సాలా ఖడూస్' తరహా సినిమాలు గతంలో చాలా వచ్చాయని, అవన్నీ అలరించాయని తనతో చాలా మంది యువకులు చెప్పారని అన్నాడు. అందుకే ఎంపిక చేసిన నగరాల్లో సినిమా విడుదల రోజున విద్యార్థులకు ఫ్రీగా చూసే అవకాశం కల్పించామని ఆయన తెలిపాడు. ఢిల్లీ, ముంబై, జైపూర్ లతో బాటు, తాను పుట్టిన నాగ్ పూర్ విద్యార్థులకు కూడా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు ఆయన వెల్లడించాడు. సినిమా థియేటర్ కు వెళ్లి యువకులు తమ ఐడీ కార్డులు చూపిస్తే టికెట్లు ఇస్తారని ఆయన చెప్పాడు. అలా వీక్షించిన వారి టికెట్ డబ్బులు సినిమా యూనిట్ భరిస్తుందని రాజ్ కుమార్ హిరానీ తెలిపాడు. కాగా, ఈ సినిమాకు తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించగా, మాధవన్, బాక్సర్ రితిక సింగ్ ఇందులో నటించారు.

  • Loading...

More Telugu News