: సొంతూర్లో నితీశ్ కుమార్ కు అవమానం


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు స్వగ్రామంలో అవమానం జరిగింది. తన స్వగ్రామమైన పట్నా జిల్లాలోని భక్తియార్ పూర్ లో శుభకార్యంలో పాల్గొనేందుకు నితీశ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనపై పీకే రాయ్ అనే వ్యక్తి చెప్పు విసిరారు. అయితే ఈ చెప్పు వేదిక దగ్గరే పడిపోయినప్పటికీ అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆ వ్యక్తిని భక్తియార్ పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. తను చేసిన ఫిర్యాదుకు నితీశ్ స్పందించలేదని పేర్కొంటూ చెప్పు విసిరినట్టు రాయ్ పోలీసులకు అతను వెల్లడించినట్టు పోలీస్ అధికారి మను మహరాజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News