: విమానాశ్రయాల భద్రతకు పటిష్ట చర్యలు: అశోక్ గజపతిరాజు
విమానాలకు బాంబు బెదిరింపులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్ డైరీని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఎయిర్ పోర్టుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని, సెక్యూరిటీ డ్రిల్స్ పటిష్టంగా నిర్వహిస్తున్నామని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.