: హెచ్సీయూ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: కేసీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య జరిగి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. కొన్ని విషయాల్లో కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, కేంద్రం తెలంగాణ ప్రజలను విస్మరిస్తోందని అన్నారు. కేంద్రం 20 స్మార్ట్ సిటీలను ప్రకటిస్తే అందులో తెలంగాణ నుంచి ఒక్కటీ లేదని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, హైదరాబాద్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.