: కోతలు లేని విద్యుత్తు ఇస్తున్నాం... గతంలో ఎవరైనా ఇచ్చారా?: కేసీఆర్


తమ పాలనలో కోతలు లేని విద్యుత్తును అందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు కోతలు లేని విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. హైదరాబాద్ జనాభాకు తగ్గట్టుగా కూరగాయల మార్కెట్లు, మాంస విక్రయ కేంద్రాలు, పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడానికి కారణం గత ప్రభుత్వాలేనని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ సర్కార్ ముందుకెళ్తోందని అన్నారు. కొత్తగా 200 మార్కెట్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ, పరిశుభ్రమైన మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఆసుపత్రులకు వచ్చే వారి కోసం నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీరు అందించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన మాటపై తాను నిలబడుతున్నానని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News