: పటాన్ చెరు నుంచి మరికాసేపట్లో చంద్రబాబు గ్రేటర్ ప్రచారం


మెదక్ జిల్లా పటాన్ చెరు నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పటాన్ చెరు తరువాత రామచంద్రాపురం, చందానగర్, మదీనగూడ, మియాపూర్, నిజాంపేట, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో బాబు పాల్గొంటారు. నేడు, రేపు జరగనున్న ఈ ప్రచారం కోసం టీడీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. అంతకుముందు పార్టీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశమై ఈ ఎన్నికలలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

  • Loading...

More Telugu News