: టీఆర్ఎస్ పై ఈసీకి పొంగులేటి ఫిర్యాదు
టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని, హైదరాబాద్ లో ఆ పార్టీ పెట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఈసీని కోరారు. అంతేగాక ఇతర జిల్లా టీఆర్ఎస్ నేతలు కూడా గ్రేటర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు.