: సిసోడియా ఇంటి ముందు చెత్త... ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన


పెండింగ్ వేతనాల కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నిన్న నగరం నడిబొడ్డున సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిష్టిబొమ్మను దహనం చేసిన కార్మికులు తాజాగా తమ ఆందోళనల వేదికను నేడు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి వద్దకు మార్చారు. నేటి ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్తా చెదారాన్ని చేత బట్టుకుని వెళ్లి మనీష్ సిసోడియా ఇంటి ఆవరణలోకి విసిరేశారు. ఆ తర్వాత ఆయన ఇంటి ముందు కూర్చుని నినాదాలతో హోరెత్తించారు. తమను నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News