: విశాఖ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఖైదీ... యాసిడ్ తాగిన వైనం
విశాఖలోని జైల్లో నేటి ఉదయం ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైల్లోని తన బ్యారక్ లోనే యాసిడ్ తాగిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళితే... ఓ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు విచారణలో ఉన్నందున అతడికి న్యాయమూర్తి జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని విశాఖ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రోజుల తరబడి జైల్లోనే ఉన్నా, తనకు బెయిల్ ఇప్పించేందుకు తన కుటుంబ సభ్యులు యత్నించడం లేదన్న ఆవేదనతో శ్రీనివాసరెడ్డి నేటి ఉదయం యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.