: చిక్కుల్లో ‘మహా’ మాజీ సీఎం చవాన్... ‘ఆదర్శ్’ కేసులో విచారణ కోసం గవర్నర్ కు సీబీఐ లేఖ


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. మహారాష్ట్రలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ప్రమేయముందని భావిస్తున్న ఆదర్శ్ కుంభకోణంలో ఆయనను విచారించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అశోక్ చవాన్ ను విచారించేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సీబీఐ అధికారులు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశారు. ఇప్పటికే ఈ కేసులో చవాన్ ను విచారించేందుకు అనుమతివ్వాలంటూ గతంలో సీబీఐ రాసిన లేఖను తిరస్కరించిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ శంకరనారాయణన్ పెద్ద దుమారాన్నే రేపారు. తాజాగా మళ్లీ సీబీఐ లేఖ రాయడంతో ఈ దఫా చవాన్ విచారణకు రాజ్ భవన్ నుంచి తప్పనిసరిగా అనుమతి లభించనుందని తెలుస్తోంది. ఇదే జరిగితే చవాన్ విచారణకు హాజరు కాక తప్పదు.

  • Loading...

More Telugu News