: హైదరాబాద్ కు నేను గెస్టును కాదు: కేటీఆర్ కు నారా లోకేశ్ కౌంటర్


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. హైదరాబాద్ కు తాను గెస్టును కాదని, తాను పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనేనని చెప్పారు. కానీ కేటీఆర్ గుంటూరులో చదివారని, తాను హైదరాబాద్ లోనే చదివానని తెలిపారు. నగరానికి కేసీఆర్, కేటీఆర్ లే గెస్టులన్నారు. ఇక హైదరాబాద్ నగరానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో కేటీఆర్ చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే 2017 జనవరి నాటికి మెట్రో రైల్ ప్రాజక్టును పూర్తిచేసి చూపుతామని లోకేశ్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News