: గ్రేటర్ లో రేపు, ఎల్లుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం: టీటీడీపీ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. రేపు, ఎల్లుండి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం పటాన్ చెరులో నిర్వహించే సభతో బాబు ప్రచారం మొదలవుతుందని చెప్పారు. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం చేస్తారని రావుల వివరించారు. 12 ఏళ్ల కిందట అధికారం కోల్పోయిన టీడీపీపై మంత్రి కేటీఆర్ కు అంత కోపం ఎందుకని ఈ సందర్భంగా రావుల ప్రశ్నించారు. హైదరాబాద్ లో అడుగడుగునా చంద్రబాబు శ్రమ ఉందని, టీఆర్ఎస్ పాలనతో హైదరాబాద్ నగరం చెత్తకుండీగా మారిందని వ్యాఖ్యానించారు.