: చంద్రబాబుకు చర్మం మందమైంది: వైఎస్ జగన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చర్మం మందమైందంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జరుగుతున్న ‘యువభేరి’ కార్యక్రమంలో విద్యార్థులతో జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని తాను ఏడాదిగా ఎస్ఐ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నానని, ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని... ఏమి చేయాలంటూ ప్రశ్నించారు. దీనికి జగన్ సమాధానమిస్తూ, ‘చంద్రబాబు చర్మం మందమైంది. సమస్యలపై స్పందించడం లేదు. చంద్రబాబును చూస్తుంటే ‘మనిషికో మాట గొడ్డుకో దెబ్బ’ అనే సామెత నాకు గుర్తుకు వస్తోంది. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఉన్న ఉద్యోగాలనే బాబు తీసేస్తున్నాడు. ఇంకా కొత్త ఉద్యోగాలెక్కడి నుంచి ఇస్తాడు?’ అంటూ జగన్ సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News