: ఆ పాటను చూసిన వంద కోట్ల మంది అభిమానులకు ధన్యవాదాలు: షకీరా
తన 'వాకా వాకా' పాటను చూసిన వంద కోట్ల మంది అభిమానులకు ధన్యవాదాలని ప్రముఖ పాప్ సింగర్ షకీరా తెలిపింది. 2010లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్ బాల్ సందర్భంగా జనవరి 4న విడుదల చేసిన 'వాకా వాకా' పాట అమిత ప్రేక్షకాదరణ పొందింది. యూట్యూబ్ లో తాజాగా ఇది వంద కోట్ల వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా తన పాటపై ఇంత అభిమానం కురిపించిన అభిమానులకు షకీరా ధన్యవాదాలు తెలిపింది. అంతకు ముందే షకీరా స్టార్ డమ్ సంపాదించుకున్నప్పటికీ, ఈ పాటతో ఆ స్టార్ డమ్ మరింత పెరిగింది. దీంతో గతాన్ని గుర్తు చేసుకున్న షకీరా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.