: రాజమహేంద్రవరంలో వైఎస్ జగన్, ఘనస్వాగతం


కాకినాడలో వైకాపా తలపెట్టిన యువభేరి కార్యక్రమానికి బయలుదేరిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో నేతలు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కాకినాడకు జగన్ బయలుదేరగా, అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తక్షణం ప్రకటించాలన్న డిమాండే ప్రధానంగా ఆయన ప్రసంగం సాగనుంది. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో జేఎన్టీయూ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News