: ట్విట్టర్ లో ఖాతా తెరిచిన కమలహాసన్


ప్రముఖ నటుడు కమలహాసన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవానికి సంబంధించి తొలి ట్వీట్ చేసి, ఓ వీడియో పోస్టు చేశారు. కమల్ ఖాతా తెరిచిన 13 గంటల్లోనే ఆయనను 29వేలకు పైగా అనుసరించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 35వేలకు పైగానే చేరింది. ఇదే సమయంలో కమల్ ట్విట్టర్ లో చేరడాన్ని ఆయన కుమార్తె, నటి శ్రుతిహాసన్ స్వాగతించింది. ఇది చాలా సంతోషకరమైన విషయమని, తనకెంతో ఇష్టమైన కమల్ ట్విట్టర్ లో చేరారంటూ ట్వీట్ చేసింది. 'లవ్ యూ అప్పా' అని తెలిపింది.

  • Loading...

More Telugu News