: భారతీయులకు బోధించాలనుకోవడం బుద్ధి తక్కువ: కట్జూ సంచలన వ్యాఖ్యలు


ఎవరేమనుకున్నా సరే చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేయడం అన్నది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూకు అలవాటు. పర్యవసానంగా ఎన్ని విమర్శలు వచ్చినా వెరవని తనం కట్జూను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టింది. అలాంటి కట్జూకు కోపం వచ్చింది. ఫేస్ బుక్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ఇకపై ఫేస్ బుక్ వాడనని రిపబ్లిక్ డే రోజున ఆయన సంచలన నిర్ణయం ప్రకటించారు. తనకు తెలిసిన మంచి విషయాలు బోధించాలని భావించానని, అయితే దానికి లభించిన బహుమానం విమర్శలు, దూషణలని ఆయన పేర్కొన్నారు. భారతీయులకు బోధించాలని భావించడం తన బుద్ధి తక్కువతనమని ఆయన అంగీకరించారు. అందుకే ఫేస్ బుక్ కు వీడ్కోలు పలుకుతున్నానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News