: పాండ్యాకు మంచి భవిష్యత్ ఉంది: ధోనీ


తొలి టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడం ఆనందంగా ఉందని కెప్టెన్ ధోనీ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ, బౌలింగ్ లో రాణించడం వల్లే తాము గెలిచామని చెప్పాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాను రోహిత్, కోహ్లీ, రైనా నడిపించారని పేర్కొన్నాడు. వారు నిర్దేశించిన లక్ష్యాన్ని బౌలర్లు సమర్థవంతంగా సంరక్షించారని ధోనీ తెలిపాడు. తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న హార్డిక్ పాండ్యా రాణించడం భారత క్రికెట్ కు శుభసూచకమని చెప్పాడు. ఒత్తిడిని జయిస్తే హార్డికి పాండ్యా నిలకడగా రాణించగలుగుతాడని, మూడు ఓవర్లు బౌల్ చేసిన పాండ్యా 34 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయడం అభినందనీయమని ధోనీ చెప్పాడు. తొలి టీట్వంటీలో విజయం సాధించడం సిరీస్ సాధనకు దోహదపడుతుందని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News