: మోదీ ప్రధాని పదవికి తక్కువ...విదేశాంగ శాఖకు ఎక్కువ: కేటీఆర్


ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ శాఖకు ఎక్కువ...ప్రధాని పదవికి తక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో గుక్కతిప్పుకోకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణకు టీఆర్ఎస్ ఏం చేసిందో గుక్కతిప్పుకోకుండా అరగంటపాటు తాను చెప్పగలనని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీరివ్వని పక్షంలో ఓట్లు అడగనని ప్రకటించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలకు తమ మాటలు అర్థం కావడం లేదని అందుకే ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News