: ఉప్పూ నిప్పులా ఉండే కేజ్రీవాల్, జంగ్ లు పక్కపక్కనే కూర్చున్న వేళ..!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ రాష్ట్ర గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలిసిందే. పలు విషయాల్లో వీరిద్దరూ పరస్పరం విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ఒకరిని ఒకరు విమర్శించుకున్న సందర్భాలెన్నో వున్నాయి. కానీ, వీరిద్దరూ నేడు కలుసుకున్నారు. అంతేకాదు, గంటన్నరకు పైగా పక్కపక్కనే కూర్చున్నారు. పలుమార్లు ముచ్చట్లాడుకున్నారు కూడా. ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు వేదికైన రాజ్ పథ్ వద్ద ఏర్పాటు చేసిన వీఐపీ ఎన్ క్లోజర్ ఇందుకు వేదికైంది. వీరితో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పీడబ్ల్యూడీ మినిస్టర్ సత్యేందర్ జైన్ తదితరులు కూడా దగ్గరుండి సైనిక విన్యాసాలు, శకటాలను వీక్షించారు. వీడియో కెమెరాలు సైతం వీరిద్దరినీ పలుమార్లు చూపాయి.

  • Loading...

More Telugu News