: ఐఎస్ఐఎస్ నుంచి 8 లక్షలు తీసుకున్నా...రిక్రూట్ చేశా: ఉగ్రవాది
ఐఎస్ఐఎస్ నుంచి 8 లక్షల రూపాయలు తీసుకుని ఆ సంస్థకు భారత్ నుంచి రిక్రూట్ మెంట్ చేపట్టినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు పట్టుబడిన ఐటీ ఉద్యోగి ముదాబ్బిర్ ముస్తాక్ షేక్ (34) తెలిపాడు. హవాలా ద్వారా ఐఎస్ఐఎస్ 8 లక్షల రూపాయలు పంపినట్టు విచారణలో ఆయన వెల్లడించాడు. ఈ డబ్బులో హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తికి 50 వేల రూపాయలు, లక్నోకి చెందిన మరో యువకుడికి 3 లక్షల రూపాయలు ఇచ్చినట్టు, ముంబైతో పాటు ఇతర పట్టణాల్లోని యువకులకు మిగిలిన మొత్తాన్ని అందజేసినట్టు ఆయన వెల్లడించాడు. ముంబైలోని ముంబ్రా అపార్ట్ మెంట్ లో ఉంటున్న ముస్తాక్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసింది.