: ఐదో ఓవర్ లో తడబడ్డ భారత్ దూకుడు!
అడిలైడ్ లో ఈ మధ్యాహ్నం ఆరంభమైన తొలి టీ-20 మ్యాచ్ లో ఇండియా ఆరంభ దూకుడుకు ఐదవ ఓవర్ లో బ్రేక్ పడింది. బంతులను వీర బాదుడు బాదిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ బౌలింగ్ లో ఫాల్కనర్ కు క్యాచ్ ఇచ్చి వన్ డౌన్ గా పెవీలియన్ దారి పట్టాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శర్మ 31 పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో ఉన్న శిఖర్ ధావన్ 5 బంతుల్లో 5 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 4.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు.