: ఎంత యాక్టింగ్, డైలాగ్ ఆఫ్ ది ఇయర్... రాజమౌళి 'అసహనం'పై నెటిజన్ల విమర్శలు
తనకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాకుండా, కర్ణాటక రికమండ్ చేస్తే పద్మశ్రీ వచ్చిందని రాజమౌళి చేసిన వ్యాఖ్య తెలుగు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. రాజమౌళికి వ్యతిరేకంగా ఆయన ట్విట్టర్ ఖాతాలోనే ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ఇది డైలాగ్ ఆఫ్ ది ఇయర్' అని, ఆయన గొప్పగా నటిస్తున్నారని, ఓ యాక్టింగ్ స్కూల్ ను మొదలు పెట్టాలని, తెలుగు చిత్ర సీమను నమ్ముకుని ఇలా మాట్లాడుతారా? అని, ఇక మీరు మా 'ఎస్ఎస్ఆర్' కాదనిపిస్తోందని, మీకన్నా గొప్ప దర్శకుడైన శంకర్ కు ఇంతవరకూ గుర్తింపు లేదని, మీ అసహనం మాకు అసహనాన్ని కలిగిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్న ట్వీట్లూ వస్తున్నాయి.