: కూతురుతో కలిసి ఢిల్లీ బయలుదేరిన ఐష్... మరికాసేపట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడితో లంచ్


బాలీవుడ్ ప్రముఖ నటి, బచన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి కొద్దిసేపటి క్రితం ముంబై నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది. భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు. మూడు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్న ఆయన నేటి ఉదయం రాజ్ పథ్ లో జరిగిన వేడకల్లో పాల్గొన్నారు. హోలాండ్ తో కలిసి లంచ్ చేసేందుకు ఆహ్వానం అందుకున్న ఐశ్వర్య... భర్త అభిషేక్ బచ్చన్ బిజీ షెడ్యూల్ కారణంగా వెంట రాకున్నా, కూతురు ఆరాధ్యతో కలిసి ఢిల్లీకి బయలుదేరింది. ప్రొ కబడ్డీ లీగ్ తో అభిషేక్ దేశంలోని పలు నగరాలను చుట్టేస్తూ గ్రామీణ క్రీడ కబడ్డీకి ప్రాచుర్యం కల్పించే పనిలో ఉన్నారు. మరికాసేపట్లో ఢిల్లీలో అడుగుపెట్టనున్న ఐష్, హోలాండ్ తో కలిసి లంచ్ లో పాల్గొననుంది.

  • Loading...

More Telugu News