: డీఆర్ఎస్ స్థానంలో ‘ఓఆర్ఎస్’... కొత్త పద్ధతికి తెర తీసిన బీసీసీఐ
గడచిన నాలుగు నెలల్లో అంపైర్ల తప్పిదాల వల్ల టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. మొదటి నుంచి డెసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్ఎస్)ను వ్యతిరేకిస్తూ వస్తున్న బీసీసీఐ, తాజా నష్టాలతో కళ్లు తెరిచింది. అంతేకాక ఈ ఏడాదిలో టీమిండియా ఏకం 17 టెస్టులను ఆడబోతోంది. ఈ క్రమంలో అంపైరింగ్ తప్పిదాలను నివారించేందుకు ఉద్దేశించిన డీఆర్ఎస్ పై తన వైఖరి మార్చుకుంది. అయితే డీఆర్ఎస్ కే మద్దతు తెలపకుండా, కొత్తగా ‘ఓవరాల్ రివ్యూ సిస్టం(ఓఆర్ఎస్)’ పేరిట సరికొత్త పద్ధతిని తెరపైకి తెచ్చింది. ఈ పద్ధతి ప్రకారం ఒక్క ఎల్ బీడబ్ల్యూ మినహా అన్ని విషయాలకు సంబందించి అంపైర్ నిర్ణయాలపై ఆటగాళ్లు టెక్నాలజీని ఆశ్రయించే వీలుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ ప్రతిపాదిస్తున్న ఓఆర్ఎస్ కు ఐసీసీ నుంచి అనుమతి లభించడం పెద్ద సమస్య కాబోదన్న వాదన వినిపిస్తోంది.