: మహిళలను అనుమతించని శనిసింగనాపూర్ ఆలయానికి వెల్లువలా మహిళలు... ఉద్రిక్తత!
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శనిసింగనాపూర్ వద్ద నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ప్రవేశంలేని ఈ ఆలయంలోకి వెల్లువలా వస్తామని, హెలికాప్టర్లలో దిగిమరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని కొన్ని మహిళా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తామంతా వచ్చి శనిదేవుడికి పూజలు చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని భూమాతా రణరాగిని బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ హెచ్చరికలు జారీ చేయడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 1500 మంది వరకూ మహిళలు దూసుకు రావచ్చన్న అంచనాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.