: ఫేస్ బుక్ లో టిప్పు సుల్తాన్ పై అనుచిత వ్యాఖ్యలు... కర్ణాటకలో ఐటీఐ విద్యార్థి అరెస్ట్
కర్ణాటకలో టిప్పు సుల్తాన్ పై మరోమారు వివాదం నెలకొంది. ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ ఐటీఐ విద్యార్థి టిప్పు సుల్తాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కర్ణాటకలోని కొప్పాలలో ఐటీఐ చదువుతున్న మంజునాథ్ ముద్గల్ అనే విద్యార్థి తన ఫేస్ బుక్ అకౌంట్ లో టిప్పు సుల్తాన్ ఫొటోలు పెట్టడమే కాక వాటిని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మంజునాథ్ ను అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన టిప్పు సుల్తాన్ ఫొటోలతో పాటు వ్యాఖ్యలను కూడా తొలగించాలని అతడికి ఆదేశాలు జారీ చేశారు.