: పొట్ట పెంచిన కానిస్టేబుల్... వీపుపై పోలీస్ బాస్ ను ఎక్కించుకుని రౌండ్లు!: సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్, విచారణకు ఆదేశం


పోలీసులు శారీరక దారుఢ్యంతో ఉండాలన్న వాదన సరైనదే. అలాగని వయసు పెరుగుతున్నా, అదే దేహ దారుఢ్యంతో ఉండాలంటే, ఎవరికైనా కాస్తంత కష్టమే. ఇందుకు పోలీసులు మినహాయింపేమీ కాదు. అయితే మనోజ్ కుమార్ అనే ఓ కానిస్టేబుల్ 97 కిలోల బరువుతో పొట్ట బాగా పెరిగిందని ఛత్తీస్ గఢ్ లోని ఉధాం సింగ్ నగర్ జిల్లా ఎస్పీ అంతెత్తున ఎగిరపడ్డారు. అంతటితో ఆగకుండా పొట్ట పెంచిన కానిస్టేబుల్ వీపుపై ఓ పోలీసు అధికారిని ఎక్కించారు. అధికారిని మోస్తూనే రౌండ్లు కొట్టాలని కానిస్టేబుల్ కు ఎస్పీ గారు ఆర్డరేశారు. అసలే ఎస్పీ... జిల్లాకు సుప్రీం పోలీస్ బాస్... ఆదేశాలతో ఓ సీఐని వీపుపై ఎక్కించుకుని మనోజ్ కుమార్ రొప్పుతూనే గ్రౌండ్ లో రౌండ్లు కొట్లాడు. మనోజ్ ఆపసోపాలను కళ్లకు కడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి ఎంటరయ్యాయి. వైరల్ అయిపోయాయి. విషయం డీజీపీ దాకా వెళ్లింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీస్ గఢ్ డీజీపీ బీఎస్ సిద్ధూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే కీలకం. వారిని కించపరిచేలా వ్యవహరించే ఓ ఒక్క చర్యను అనుమతించే ప్రసక్తే లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News