: గూగుల్ ‘గణతంత్ర’ గ్రీటింగ్స్... బీఎస్ఎఫ్ కామెల్ కంటింజెంట్ డూడుల్ విడుదల
భారత గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రముఖ సెర్చింజన్ ‘గూగుల్’ సరికొత్త డూడుల్ తో దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది. ఇప్పటిదాకా విడుదల చేసిన డూడుల్స్ కు భిన్నంగా గూగుల్ ‘గణతంత్ర’ డూడుల్ గా భారత సరిహద్దు భద్రతా దళం... బీఎస్ఎఫ్ కు చెందిన కామెల్ కంటింజెంట్ తో కూడిన చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటిదాకా గూగుల్ విడుదల చేసిన అన్ని డూడుల్స్ లో యానిమేషన్ ఉండేది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా యానిమేషన్ లేని డూడుల్ ను విడుదల చేసి భారత్ కు తాను ఇస్తున్న ప్రాధాన్యతను గూగుల్ చెప్పకనే చెప్పింది.